calender_icon.png 16 May, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

16-05-2025 01:49:30 PM

హైదరాబాద్: నగరంలో నకిలీ ధ్రువపత్రాలు(Fake Certificates Gang Arrested) తయారీ ముఠా గుట్టు రట్టు అయింది. నకిలీ భూమి పత్రాలు, ఫోర్జరీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న ముఠాను ఎల్బీనగర్, ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు(Rachakonda Police) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. నిందితుల నుంచి నకిలీ రెవెన్యూ పత్రాలు, స్టాంపులు, నకిలీ సేల్ డీడ్లు, ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నకిలీ భూ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సాత్విక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 9 ఏళ్లుగా నకిలీ పత్రాలు ముద్రిస్తున్నారు. తొమ్మిదేళ్లలో 280 నకిలీ సేల్ డీడ్ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాన్ని రూ. 5 వేల నుంచి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు.