calender_icon.png 16 May, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కేసముద్రంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

16-05-2025 03:47:05 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం రైతు వేదికలో తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.వెంకన్న తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల కు చెందిన శాస్త్రవేత్తలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9:30 గంటలకు రైతులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వానాకాలం పంటల సాగులో చేపట్టవలసిన ముందస్తు పనులు, అదేవిధంగా సాగుకు సమాయత్తం చేయడానికి  రైతులకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని, రైతు సోదరులు శనివారం ఉదయం 9:30 గంటలకు కేసముద్రం రైతు వేదికకు విచ్చేసి శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి  వచ్చే వానాకాలం సీజన్లో  మంచి పంట దిగుబడులు పొందాలని  కేసముద్రం మండల  వ్యవసాయ అధికారి బి. వెంకన్న తెలిపారు.