16-05-2025 03:08:06 PM
బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) పట్టణ 21వ మహాసభ ఈనెల 25న జరుగుతున్నదనీ ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి తెలిపారు. గురువారం మహాసభకు సంబంధించిన కరపత్రాలను స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. 25న ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో జరుగుతుందని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికీ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశ స్వాతంత్ర కోసం దేశ ప్రజల అనేక సమస్యలపై అలుపెరగని ఎన్నో పోరాటాలు, రైతాంగ సాయుధ పోరాటాలు జరిగాయఅన్నారు.
ఎంతో మంది కామ్రేడ్స్ ని కోల్పోయిన పార్టీ ఆత్మ ధైర్యంతో ముందుకు పోతున్నదని తెలిపారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేదరికంలో ఆకలి చాలు, నిరుద్యోగ సమస్య ఉందని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని, కేసిఆర్ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని వెతికి తీయాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి అభివృద్ధికై మున్సిపల్ లో జరిగిన అవినీతిపై, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ స్కీమ్, పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, సింగరేణి పాత క్వాటర్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు .పట్టణంలో సరఫరా అవుతున్న మంచినీటి సమస్యపై, ప్రభుత్వ విద్యుత్, సింగరేణి విద్యుత్, సరఫరా,బెల్లంపల్లి లో తక్షణమే బస్ డిపో నిర్మించాలన్నారు.
కళాశాల ఏర్పాటు, పేరుకే వంద పడకల ఆసుపత్రి నిర్మించి దానిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించా లని స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, నాణ్యత కలిగిన మందులు నివ్వాలన్నారు. పట్టణ పరిసరాల్లో గత కొన్ని సంవత్సరాలుగా భూకబ్జాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రభుత్వ, సింగరేణి భూము లు అన్యాక్రాంతo అవుతున్నాయన్నారు. అట్టి భూములు కాపాడాలని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలపై ఈ మహాసభలో చర్చించి పోరాట కార్యక్రమాలు రూపొందించబడుతుందనన్నారు.
అలాగే ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోతామని, ప్రజలు పార్టీని ఆదరించి అభిమానించి పార్టీకి చేయూత నివ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ,జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ ,సీనియర్ నాయకురాలు సరోజ, జిల్లా సమితి సభ్యులు బియ్యాల ఉపేందర్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం,బొంకురి రామ చందర్, శనిగారపు రాజేందర్,బండారు శంకర్, ఇనుముల రాజమల్లు,కోడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.