calender_icon.png 17 May, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యకు కారకుడైన నిందితునికి జైల్ శిక్ష

16-05-2025 05:02:56 PM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ప్రేమించమని వత్తిడికి గురి చేసి యువతి ఆత్మహత్యకు కారకుడైన నిందితునికి 12 సంవత్సరాల 6 నెలలు జైలు 17 వేలు జరిమాన విధించినట్లు  జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ శుక్రవారం తెలిపారు. కనగల్ మండల పరిధిలోని  యువకుడు,అదే మండలానికి చెందిన యువతిని ప్రేమించమని వేధిదింపులకు గురి చేసి యువతి ఆత్మహత్యకు కారకుడైనందుకుగాను మృతురాలు తండ్రి కనగల్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన  పిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించారు. దీంతో నేరస్తునిపై నేరం రుజువు కావడంతో ఫ్యామిలీ కోర్టు నేరస్తునికి శిక్ష విధించింది.

ఇట్టి కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి  సరైన ఆధారాలను సేకరించి చార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేసిన అప్పటి దర్యాప్తు అధికారులు సిఐ ఎ.వెంకటయ్య, యస్.ఐ ఎన్.అంతి రెడ్డి, ప్రస్తుత సిఐ కె.ఆది రెడ్డి, ఎస్.ఐ  పి.విష్ణుమూర్తి, అదనపు పిపి. జవహర్‌లాల్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ వై. నగేష్, కోర్టు లైజెనింగ్ ఆఫీసర్ పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్  జిల్లా ఎస్పీ  అభినందించారు.