calender_icon.png 10 October, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్‌కర్నూ ల్‌లో గ్యాంగ్‌వార్స్!

10-10-2025 01:31:47 AM

  1. యువకుల మధ్య గ్రూపు తగాదాలు
  2. గ్రూపులుగా విడిపోయి మద్యం మత్తులో పరస్పరం దాడులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇటీవల గ్యాంగ్‌వార్స్ ఉధృతమవుతున్నా యి. మద్యం మత్తులో యువకులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు తెగబడుతున్న ఘటనలు వరుసగా బయట పడుతున్నాయి. అర్ధరాత్రిళ్ల వరకు బెల్టు షాపులు, పాన్ షాపులు యువతకు అడ్డాలుగా మారి, మత్తులో షికార్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

భారీ శబ్దాలతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ స్టంట్ వేస్తూ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇటీవలి దుర్గామా త ఉత్సవాల సందర్భంగా ఒక మండపం వద్ద జరిగిన గ్యాంగ్ వార్ సీసీ కెమెరాలో రికార్డు అయింది. గతంలో బస్టాండ్ సమీపంలోని పూల దుకాణం ముందు, జూలైలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

అయినా పోలీసు అధికారులు ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైన ట్రాఫిక్ పోలీసులు   గ్యాంగ్ వార్స్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడా లని స్థానికులు  కోరుతున్నారు.