కీతవారిగూడెంలో కనుల పండువగా గంగమ్మ తల్లి జాతర
28-07-2026 12:00 AM
గరిడేపల్లి, జూలై 27: మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో సోమవారం యాదవుల ఆరాధ్యదైవమైన గంగమ్మ జాతరను యాదవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంద గంపలు ఎత్తుకొని బోనాలతో యాదవుల సంప్రదాయాల నృత్యాలతో గుడి ప్రాంగణానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
గరిడేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ మహిళా భక్తులతో కలిసి బోనమెత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ చింతకాయల వెంకటేశ్వర్లు, సారె గొల్ల రేఖ వెంకట నర్స్, గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నాయకులు చింతకాయల సైదులు యాదవ్, సంఘబుడ్డి నరసయ్య, పలువురు యాదవ కుల పెద్దలు పాల్గొన్నారు.






