9 July, 2026 | 1:01 AM

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గంగూలీ

09-07-2026 12:00 AM

దుబాయి, జూలై 9 : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ దిగ్గజ సారథి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నా డు. తద్వారా ఈ అరుదైన గౌరవం దక్కిన 12వ భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో సచిన్, ద్రవిడ్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కపిల్ దేవ్, గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, మహిళల విభాగం నుంచి డ యానా ఎడుల్జీ, నీతు డేవిడ్ ఎంపికయ్యారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ను 2009లో ప్రారంభించారు.

భారత క్రికెట్‌కు 17 ఏళ్ల పాటు సే వలందించిన దాదా తన దూకుడుతో టీ మిండియా రూపురేఖలనే మార్చేశాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం, 2004 లో పాక్‌పై టెస్ట్ సిరీస్ విజయం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో టెస్ట్ సిరీస్‌లను డ్రా చేసుకోవడం వంటివి హైలెట్‌గా నిలిచాయి. గంగూ లీ 311 వన్డేల్లో 11,363 పరుగులు, 113 టెస్టుల్లో 7212 పరుగులు చేశాడు.