19 July, 2026 | 2:47 PM

ఫిల్ సాల్ట్ మెరుపులు.. భారత్ ముందు 202 పరుగుల భారీ లక్ష్యం

08-07-2026 12:57 AM

ఇంగ్లాండ్ భారీస్కోరు

రాణించిన ప్రిన్స్ యాదవ్

నాటింగ్‌హామ్, జూలై 7: భారత్‌తో జరుగుతున్న మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ భారీస్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బట్లర్, సామ్ కరన్ మెరుపులు తోడవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే రవి బిష్ణోయ్‌పై వేటు వేసి ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

India vs England 3rd T20లో ఫిల్ సాల్ట్ (Phil Salt) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ (England) 20 ఓవర్లలో 201/7 భారీ స్కోరు నమోదు చేసింది. జోస్ బట్లర్, సామ్ కరన్ కీలక ఇన్నింగ్స్ ఆడగా, భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ ఆకట్టుకున్నాడు. ఈ విజయలక్ష్యాన్ని భారత్ ఎలా ఛేదిస్తుంది?

తొలి ఓవర్‌నే అర్షదీప్‌సింగ్ మెయిడెన్ చేయడంతో ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. అయితే రెండో ఓవర్ నుంచి బట్లర్ , సాల్ట్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 21 బంతుల్లోనే 36(4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసిన బట్లర్‌ను ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన రెండో ఓవర్‌లో బ్రూక్(16)ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. అయితే సాల్ట్, బెథెల్ మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సాల్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెథెల్ (13), టామ్ బాంటన్(0)లను హర్షిత్ రాణా ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు.

Phil Salt ఎలా ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు అందించాడు?

ఒకవైపు వికెట్లు పడుతున్నా సాల్ట్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలు బాదాడు. సామ్ కరన్ కూడా అతనికి తోడవడంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు వేగం టాప్‌గేర్‌లో సాగింది. సాల్ట్ 44 బంతుల్లో 70 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత విల్ జాక్స్, సామ్ కరన్ 34 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసిం ది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సామ్ కరన్ 24 బంతుల్లోనే 41 (4 ఫోర్లు) పరుగులు చేశాడు.

Prince Yadav ప్రదర్శన ఎలా ఉంది?

భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 30 పరుగులకు 2 వికెట్లు తీసాడు. హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

భారత్ ముందు ఎంత లక్ష్యం? తర్వాత ఏమవుతుంది?

ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించాల్సి ఉంది. భారత్ బ్యాటింగ్ విభాగం ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది.

స్కోరు బోర్డు: ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 201/7 (సాల్ట్ 70, బట్లర్ 36, సామ్ కరన్ 41 బ్రూక్ 16 ; ప్రిన్స్ యాదవ్ 2/30, రాణా 2/40)

FAQ's

PHIL SALT ఎంత పరుగులు చేశాడు?

Phil Salt 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

ENGLAND ఎంత స్కోరు చేసింది?

ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 201/7 స్కోరు చేసింది.

PRINCE YADAV ఎన్ని వికెట్లు తీశాడు?

ప్రిన్స్ యాదవ్ రెండు కీలక వికెట్లు తీశాడు.

భారత్‌కు ఎంత లక్ష్యం?

భారత్ విజయం సాధించాలంటే 202 పరుగులు చేయాలి.

India vs England 3rd T20లో Phil Salt అద్భుత బ్యాటింగ్‌తో England 201/7 భారీ స్కోరు చేసింది. Prince Yadav బౌలింగ్ ఆకట్టుకున్నప్పటికీ, భారత్ ముందు ఇప్పుడు 202 పరుగుల కఠిన లక్ష్యం ఉంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని తాజా అప్డేట్స్ కోసం Vijayakranthi News ను ఫాలో అవుతూ ఉండండి.