వరల్డ్‌కప్ అంతా రిగ్గింగే
ఈజిప్ట్ కోచ్ సంచలన ఆరోపణలు
అట్లాంటా, జూలై 8 : ఫిఫా నిర్వాహకులపై ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ సంచలన ఆరోపణలు చేశాడు. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఫిఫా అంపైర్లకు తమకు అన్యాయం చేశారని తెలిపాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేశారని ఆరోపించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3 తేడాతో ఈజిప్ట్‌ను ఓడించింది. అయితే ఈజిప్ట్ ప్లేయర్ జికో 59వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ.. దానిని ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత.. మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఈజిప్ట్ కోచ్ హోసామ్ హసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముస్తఫా జికో చేసిన గోల్‌ను వీఏఆర్ ద్వారా ఫౌల్‌గా ప్రకటించారు. అర్జెంటీనా ప్లేయర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్.. ఈజిప్ట్ ప్లేయర్ హమ్దీ ఫాతి జెర్సీని వెనక్కి లాగినా.. మ్యాచ్ రిఫరీలు కనీసం వీఏఆర్ రివ్యూ కూడా చూడకుండా పెనాల్టీ అప్పీల్ను తిరస్కరించారు.






