26 July, 2026 | 1:47 AM

గంజాయి, వీడ్ ఆయిల్ ముఠా అరెస్ట్

26-07-2026 01:04 AM

నల్లగొండ క్రైం, జూలై 25 (విజయక్రాంతి): ఒడిశా నుంచి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఏం ఎల్ వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్లు, 4 సెల్‌ఫోన్లు, డమ్మీ తుపాకీ, బట్టన్ చాకు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలను నల్లగొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి శనివారం వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని మునుగోడు బైపాస్ రోడ్డులోని  ఖాళీ స్థలంలో కొంతమంది యువకులు గంజాయిని విక్రయిస్తూ, వినియో గిస్తున్నారనే సమాచారంతో పోలీసులు 8 మందితో పాటు ఓ మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధు, చెన్నపాక సుశాంక్, పెండ్ర వాసు, సయ్యద్ షోయబ్, గంధం శివమణి, నకిరేకంటి ధరణి కుమార్, ఓ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. మనుకర్ నివాసం, హరి నివాసం, ఉదయ్, జున్ను పరారీలో ఉన్నారు.