31 July, 2026 | 6:48 AM

ఇంట్లోనే గంజాయి దందా

29-05-2024 12:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (విజయక్రాంతి) : నగరంలోని బాలానగర్ ఫతేనగర్‌లో ఇంట్లోనే గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్న ఓ మహిళను ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఫతేనగర్‌కు చెందిన షేక్ జామీన్‌బీ అనే మహిళ కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు సాగిస్తోందని, రూ.300 నుంచి రూ. 500 వరకు ధరను నిర్ణయించి అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్‌ఎఫ్‌టీ ఎస్సై బి. బాలరాజు తెలిపారు. పురానాపూర్‌లో రూ.6 వేలకు కిలో గంజాయిని కొని రూ.10 వేలకు నిందితురాలు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. తన ఇంట్లోనే యథేచ్ఛగా గంజాయిని అమ్ముతున్న మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.