calender_icon.png 4 December, 2024 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెంలో గంజాయి విక్రేతల అరెస్టు

09-07-2024 03:10:40 AM

  • పోలీసులు అదుపులో ఏడుగురు నిందితులు 
  • 21కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం 21కిలో ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3వ పట్టణ సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐ పురుషోత్తం తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్‌లో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన ఏడుగురిని అదపు లోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణ చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 21 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, 4 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మేడ్చల్ జిల్ల్లా కాప్రా మండలం చర్లపల్లికి చెందిన బాదల్ రౌతు, అదే ప్రాంతానికి చెందిన ముమ్మడి విష్ణువర్ధన్, అశోక్‌నగర్‌కు చెందిన నితీష్ యాదవ్ అలియాస్ మోనో, సిద్దిపేటలోని భారత్‌నగర్‌కు చెందిన కాలువ వెంకటేష్, గాంధీనగర్‌కు చెంఇన మహమ్మద్ సాదుల్, అదే ప్రాంతానికి చెందిన మోతే ఆకాశ్, వరంగల్ జిల్లా జాఫర్ఘడ్ మండలం గర్నవల్లికి చెందిన తిరుపతి హరీష్‌లుగా గుర్తించారు.

గంజాయి అమ్మిన వ్యక్తి అరెస్టు 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో మందమర్రికి చెందిన మేకల గంగాధర్(19)కు మహారాష్ట్రలోని చంద్రాపూర్ బెంగాలి క్యాంపునకు చెందిన విశ్వదేవ్ మిశ్రా(35) రెండు కిలోల గంజాయి విక్రయించాడు. సోమవారం విశ్వదేవ్‌ను అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అప్జలొద్దిన్ తెలిపారు. 58 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీ నం చేసుకున్నామన్నారు.