56 లక్షల గంజాయి పట్టివేత: నలుగురి అరెస్టు
26-07-2026 12:00 AM
భద్రాచలం, జూలై 26 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డు లోగల వీరభద్ర ఫంక్షన్ హాల్ వద్ద భద్రాచలం ఎక్సుజ్ సిబ్బంది శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 52 లక్షల విలువగల 101 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నారు. 6 బ్యాగులలో ఎండు గంజాయి మొత్తము 101 కిలోలు కనిపించింది.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కర్నాటకకు చెందిన సలీం పాషా, హర్బజ్ హుస్సేన్ , గుల్జార్, ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చెందిన రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వీరు ఆంధ్ర ప్రదేశ్‌లోని మారేడుమిల్లి నుండి గంజాయిని కిలో రూ.1,500 కొని బెంగళూరులో 8 వేలకు అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు.






