జపాన్‌లో షార్ట్స్ ట్రెండ్!
ఆఫీసు సంస్కృతిలోకి కొత్త దుస్తులు
హైదరాబాద్, (విజయక్రాంతి): జపాన్ దేశంలో ఆఫీసుల్లో షార్ట్స్ ట్రెండ్ నడుస్తోంది. వేసవి లో పని వాతావరణాన్ని సౌకర్యవంతంగా మార్చడంతోపా టు ఏసీల వినియోగాన్ని తగ్గించి విద్యుత్‌ను ఆదా చేయడం కోసం దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులు తేలికపాటి దుస్తులు ధరించే లా ప్రోత్సహించడానికి జపాన్ అధికారులు పలు ప్రయత్నాలు మొద లు పెట్టారు. జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ 2005లోనే ఈ ’కూల్ బిజ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించేందుకు 1997లో కుదిరిన ‘క్యోటో ప్రోటోకాల్’ ఒప్పందానికి అనుగుణంగా జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ఆఫీసుల్లోనూ ఇది వేర్వేరు స్థాయిల్లో అమలవుతోంది. గతంలో పర్యావరణ మంత్రిగా ఉంటూ..
2016లో టోక్యో గవర్నర్ గా ఎన్నికైన యురికో కొయికే మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటం, పర్యావరణ మార్పుల వల్ల విద్యుత్ కొరత ఏర్పడుతుండటంతో ఈ నిర్ణయం చాలా కీలకమైనదని తెలిపారు. రికార్డు స్థాయిలో విపరీతంగా పెరిగిన ఎండలను తట్టుకోవడానికి, తమ ఉద్యోగులు ఆఫీసులో షార్ట్స్ ధరించేందుకు టోక్యో ప్రభుత్వం ఇచ్చిన కొత్త వెసులుబాటును ఆయన ఉపయోగించుకున్నారు. ‘కూల్ బిజ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం కింద ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు భారీ సూట్లకు బదులుగా పోలో షర్టులు, నూలు దుస్తులు (లినెన్) , స్నీకర్లు ధరించమని ప్రభుత్వం సూచిస్తోంది. కొత్తగా అనుమతించిన ‘షార్ట్స్’ ధారణపై కొందరిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.






