18-02-2026 07:27:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో మసీదుల వద్ద బుధవారం మున్సిపల్ అధికారులు చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ ప్రారంభమైన నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతి మసీదుల వద్ద చెత్తబుట్టలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల అనురాధ చక్రవర్తి ఆదేశించడంతో వీటిని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రజలు చెత్తను చెత్తబుట్టిలోనే వేయాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.