6 June, 2026 | 5:48 PM

Breaking News

ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •  

చెత్త నిర్వహణ భేషుగ్గా ఉండాలి

15-02-2026 12:00 AM
  1. నాలా పనుల్లో వేగం పెంచాలి 
  2. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి):  నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, వర్షపు నీటి కాలువల నిర్మాణంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్ర స్థాయిలో విస్తత పర్యటన చేశా రు. నాగో ల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన.. చెత్త నిర్వహణ తీరుతెన్నులను, అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు.

ముందుగా మన్సూరాబాద్ ఆటోనగర్లోని డంపింగ్ యార్డ్‌ను కమిషనర్  సం దర్శించారు. అక్కడ ప్రతిరోజూ సేకరిస్తున్న చెత్త, వ్యర్థాల నిర్వహ ణ కార్యకలాపాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యార్డులో ఉన్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. చెత్త నిర్వహణ బేషుగ్గా చేపట్టాలని కోరారు.

అనంతరం నాగోల్ సర్కిల్, సౌతెండ్ పార్క్ కాలనీలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు.  నిర్ణీత గడువులోగా ఈ డ్రైన్ పను లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగోల్ సర్కిల్ నెం.11 డిప్యూ టీ కమిషనర్ రవీందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సీఈ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.