15 April, 2026 | 12:30 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

41వ వసంతంలోకి హెలెన్ కెల్లర్ విద్యా సంస్థలు

15-02-2026 12:00 AM

ఘనంగా విజయోత్సవాలు జరుపుకొన్న ఇనిస్టిట్యూషన్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): హెలెన్ కెల్లర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టి ట్యూషన్స్ తమ 41 ఏళ్ల విద్యా సేవా ప్రయాణాన్ని శనివారం ఘనంగా జరుపుకుంది. ఈ ప్రత్యేక వేడుకల్లో విద్యా సంస్థల చైర్మన్ జన్మదినం కూడా జరుపుకోవడం విశేషం. ఇందు లో భాగంగా బదిలీ విద్యార్థులకు, బీఎస్సీ ఆడియో లాజిఎంఎస్సీ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ రకాలైన ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

40 వసంతాల్లో భాగంగా మొదట ఒక చిన్న స్కూలు నుంచి ప్రారంభమైనటువంటి హెలెన్ కిల్లర్ సమస్త అంచలంచలుగా పురోభివృద్ధి సాధించుకుంటూ ఈరోజు టీచర్ ట్రైనింగ్ కోర్స్, ఆర్డియాలజీ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ మన దేశానికి అందిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి సేవలను అంది స్తున్నటువంటి ఇనిస్టిట్యూషన్ గా పేరు ప్రఖ్యాతులను గాంచింది. ఇందులో చదివినటువంటి దాదాపు 740 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందారు.

దీనికోసం అహర్నిశలు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రొఫెసర్ పఠాన్ ఉమర్‌ఖాన్‌ని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఎల్‌పీ (ఆడి యాలజీ అండ్ స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ), హియరింగ్ ఇంపెయర్డ్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నా రు. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే సాం స్కృతిక కార్యక్రమాలు, ప్రేరణాత్మక ప్రసంగాలు, ప్రత్యేక ప్రదర్శనలు ఈ వేడుకలో ఆకర్షణగా నిలిచాయి.

చైర్మన్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమానత్వం, దయ, నాణ్యమైన విద్య ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదగగలరని, హెలెన్ కెల్లర్ సంస్థ లు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల కోసం పోరా డుతున్నటువంటి జాతీయస్థాయి వికలాంగుల హక్కుల సంస్థ కొల్లి నాగేశ్వరరావు, రమేష్, టైగర్ నాగేశ్వరరావు,  వికలాంగుల కోసం పనిచేస్తున్నటువంటి వివిధ ఎన్జీవోస్ ప్రతినిధులను ఫౌండర్ చైర్మన్ ప్రొఫెసర్ పటాన్ ఉమర్ఖాన్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనిల్ శ్రీ రాం పార్ట్నర్ ఐబీఎం ఇండియా సంస్థ ప్రతినిధి,డీజే శ్రీనివాస్ రీజినల్ మేనేజర్ ఎల్ ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్, అధ్యాపక సిబ్బందిని అభినందించారు.