calender_icon.png 24 October, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్

24-10-2025 01:10:51 AM

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 23(విజయక్రాంతి): జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా, అదనపు కలెక్టర్ రె వెన్యూ గడ్డం నగేష్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్‌వాల్ బాధ్యతలు స్వీక రించారు. కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్ల గా, ఇంచార్జి కలెక్టర్ గా సైతం గరిమా అగ్రవాల్ బాధ్యత లు స్వీకరించారు. ఈ సంద ర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజే శారు. ఏవో రామ్ రెడ్డి, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.