calender_icon.png 24 October, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీలకు క్యాబినెట్‌లో స్థానం

24-10-2025 01:10:03 AM

-డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ 

-జూబ్లీహిల్స్‌లో 50 వేల మెజార్టీతో గెలుస్తాం

-రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్‌ఎస్ దండుపాళ్యం ముఠా 

-పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

నిజామాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. గురువారం నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరినాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త క్యాబినెట్‌లో మైనార్టీలకు స్థానం కల్పి స్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని చెప్పారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాం గ్రెస్ పార్టీ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మహేశ్‌కుమార్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ కామెంట్స్‌పై ఆయన  స్పందిస్తూ.. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసిన నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని కాంగ్రెస్ అందించే సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీతో ప్రజలు భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన దండుపాళ్యం ముఠా అంతా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల నిరంకుశ పాలన, రాష్ట్ర ఖజానా దోపిడీ, భూ అక్రమాలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.

దండుపాళ్యం ముఠా ఏం చేసిందో కేసీఆర్ కూతురు కవితనే స్వయంగా చెప్పారని, కవిత ఆరోపణలకు కేటీఆర్ జవాబు చెప్పాలని మహేశ్‌కుమార్ డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క మహిళకు కూడా క్యాబినెట్‌లో చోటు ఇవ్వలేదన్నారు. కుటుంబ తగా దాలను పరిష్కరించుకో లేని కేటీఆర్.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నిజామాబాద్ జిల్లాలో 35 ఏళ్ల కల ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి చూపించామ ని తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ చాలా కూడా ఏర్పాటు చేస్తామనీ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఆసి యా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక జిల్లాగా తీర్చిదిద్దడానికి పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా నిజామాబాద్ జిల్లాను పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేందుకు పామ్‌ఆయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశామన్నారు. రూ.380 కోట్లతో తెలంగాణ టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్‌ఓబి నిర్మాణాల విషయంలో రాష్ట్ర నిధులే కాదు కేంద్రం నిధులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఎంపీ అర్వింద్ చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించాలని సూచించారు. మహేశ్‌కుమార్ వెంట ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఉన్నారు.