24-10-2025 01:10:58 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పి ల్లల కంటే ఎక్కువగా ఉంటే పోటీకి అనర్హులుగా ఉన్న నిబంధన 21(3) ఎత్తివేతకు క్యా బినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొల గిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీని 2026 నాటికి పూర్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. క్యాబి నెట్ సమావేశం అనంతరం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరామ్ నాయక్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు సంబంధించి చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైలును గవర్నర్‌కు పంపించాలని మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు.
ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు క్యాబినెట్ అనుమతించిందని తెలిపారు. అం చనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తిచేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చిందని, అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించనున్నట్లు చెప్పారు.
హైకోర్టు తీర్పును బట్టి స్థానిక ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచన ల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న ఒక పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానుంది. ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుం ది. అందుకే నవంబర్ 7న మరోసారి క్యాబినెట్ సమావేశం కావాలని నిర్ణయం జరిగింది.
ఆ రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ తీర్మానించిందన్నారు. రాష్ర్టంలో నిర్మాణం లో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తిచేయాలని క్యాబినెట్ చర్చించింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. రాష్ర్టంలో 1500 మెగావాట్ల బ్యాట రీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమో దం తెలిపిందన్నారు.
రామగుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్‌టీఎస్-బీ 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగిసినందున దానిని తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, రాష్ర్టంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేండ్ల డిమాండ్ కనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక చేయాలని విద్యుత్తు శాఖను ఆదేశించింది. అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని సూచించింది.