నూతన పోకడలకు తగ్గట్టుగా వస్త్రాలను తయారు చేయాలి

23-04-2024 02:05:51 AM

ఫిక్కీ సహకారంతో చేనేత కార్మికులకు ముడిసరుకులు

లెనిన్ వస్త్రాల తయారీకి లెనిన్ దారాలు అందిస్తాం

తెలంగాణ చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి ఐఎస్

సిద్దిపేట, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ప్రస్తుత పోకడలకు తగ్గట్టుగా చేనేత వస్త్రాల ను రూపొందించాలని తెలంగాణ చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి ఐఎఎస్ సిద్దిపేట చేనేత కళాకారులకు సూచించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఫిక్కీ మహిళా సభ్యులతో కలిసి సిద్దిపే ట జిల్లాలోని చేనేత సోసైటీలను పరిశీలించారు. సిద్దిపేట, ఇరుకోడు చేనేత సహకార సంఘాలు, తుమ్మగాలయ్య మాక్స్ సొసైటీ, మల్లికార్జున మాక్స్ సొసైటీలను సందర్శించి ప్రఖ్యాతిగాంచిన గొల్లబామ చీరలతో పాటు రామప్ప సిల్క్ చీరలు, చేనేత వస్త్రాలను పరిశీలించారు. మారుతున్న కాలానికి అనుగు ణంగా చేనేత కార్మికులు వస్త్రాలను రూపొందించాలన్నారు.

దుబ్బాకలో బీడీల మీద ఆధారపడి జీవించిన మహిళలు అది మానేసి మగ్గం నేస్తుండగా వారి వద్దకు వెళ్లి చేనేత కార్మికులకు అవసరమైన ముడిసరుకులు కూడా ఫిక్కీ సహకారంతో అందిస్తామ న్నారు. అలాగే దుబ్బాకలో తయారవుతున్న చేనేత చీరెలు, లెనిన్ షర్టింగ్‌లను పరిశీలించి లెనిన్ వస్త్రాల తయారీకి అవసరమైన లెనిన్ దారాన్ని టెస్కొ నుంచి దుబ్బాక చేనేత సంఘానికి అందిస్తామన్నారు. అధికారులు తమ పనితనాన్ని చూసి సహాయ సహాకారా లు అందిస్తామనడంతో కార్మికులంతా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టెస్కో ఓఎస్డీ రతన్ కుమార్, ఆర్‌డీడీ అశోక్‌రావు, చేనేత జౌళి శాఖ సిద్దిపేట సహాయ సంచాలకులు సంతోష్‌కుమార్, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.