త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
30-05-2025 10:49 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం కేంద్రానికి చెందిన కర్నాటి పాండరయ్య ఇంట్లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ లీకై ఒక్కసారిగా పెద్ద మంటలు రావడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సాయంతో సిలిండర్ మంటలను ఆర్పివేశారు.






