4 July, 2026 | 10:32 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నాలా పనుల్లో వేగం పెంచాలి

31-05-2025 12:00 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నాలా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చార్మినార్ జో న్ సంతోష్‌నగర్ సర్కిల్‌లో  నాలా పనులను యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఫెండీ లతో కలిసి పరిశీలించారు.

నాలాల వల్ల కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కమిషనర్‌కు వివరించారు. గంగానగర్ నాలా మరమ్మతు పనులు 70 శాతం పూర్తయ్యాయని ప్రాజెక్టు ఈఈ బీఎల్ శ్రీనివాస్ కమిషనర్‌కు వివరించారు. మిగిలిన 30 శాతం పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు.

గంగానగర్ నాలాకు ఇరువైపులా జలమండలి పైప్‌లైన్ సమాంతరంగా ఉన్నందున జీహెచ్‌ఎంసీ మెయింటెనె న్స్ ఇంజనీరింగ్ వింగ్, జలమండలి అధికారులు కలిసి క్లీన్ చేయాలని ఆదేశించారు. జహంగీర్ నగర్ కాలనీ నుంచి మౌలానా కా చిల్ల నాలా వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

కమిషనర్ వెంట జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ప్రాజెక్టు ఈఈ బీఎల్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, పత్తర్‌గట్టి కార్పొరేటర్ సోహెల్ మహమూద్ ఖాద్రీ, డబీర్‌పుర కార్పొరేటర్ అలందార్‌హుస్సేన్ ఖాన్, రెయిన్ బజా ర్ కార్పొరేటర్ వాసా ఉద్దీన్,

సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, తలాబ్ చంచలం డాక్టర్ సమీనాబేగం, మొఘల్‌పుర కార్పొరేటర్ నస్రీన్ సుల్తానా, కుర్మగూడ కార్పొరేషన్ షఫత్ అలీ తదితరులు ఉన్నారు.