18 April, 2026 | 11:47 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

గ్యాస్ సిలిండర్ ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్..

03-06-2025 04:44 PM

తప్పిన  ప్రమాదం..

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ లో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటోని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీకొట్టడంతో ట్రాలీ నడిరోడ్డుపై బోల్తా కొట్టింది. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ లు చెల్లాచెదురు అయ్యాయి. కొన్ని సిలిండర్ లు లీక్ అయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకొని పారిపోయే యత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. ట్యాంకర్ టైర్ కింద గ్యాస్ సిలిండర్ చిక్కుకుపోయింది. ఆటోలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు 108 ద్వారా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిలిండర్లు చెల్లాచెదురు కాక ట్యాంకర్ కింద కూడా ఇరుక్కుపోయి పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పడంతో  వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.