గేటెడ్ కమ్యూనిటీ రొమాంటిక్ థ్రిల్లర్
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. గేటెడ్ కమ్యూనిటీలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ కథతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోవిందు కాండ్రేగుల నిర్మాత.
కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 31న రిలీజ్ కానున్న ఈ చిత్రంలోని ‘మధురమా..’ అనే పాటను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి డీవోపీ: నిమ్మల జయపాల్‌రెడ్డి; సంగీతం: కనిష్క; పాటలు: పూర్ణాచారి; మాటలు: వై అమ్మిరాజు; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్.






