22 June, 2026 | 8:14 AM

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటా పెంచుకున్న గౌతమ్ అదానీ

15-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 14: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్)లో బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ తన వాటా ను పెంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ త్రైమాసికంలో మార్కెట్ కొనుగోళ్ల ద్వారా వాటాను 1.32 శాతం పెంచుకున్నట్టు కంపెనీ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీ లకు తెలిపింది. ఏఈఎల్‌లో అదానీ రెండు దఫాలుగా ఈ కొనుగోళ్లు జరిపారు. తన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కెంపాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మే 10 తేదీల మధ్య 0.42 శాతం వాటాల్ని కొనుగోలు చేయగా, మే 21 12 మధ్యకాలంలో ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ద్వారా మరో 0.92 వాటాల్ని కొన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు తాజాగా 1.41 శాతం పెరిగి రూ.3,269 వద్ద ముగిసింది.