16-10-2025 12:00:00 AM
రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఫౌజియా
నాగర్ కర్నూల్ అక్టోబర్ 15 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్రం గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా నాగర్ కర్నూల్ బాలికల జూనియర్ కళాశాల గణిత అధ్యాప కురాలు కోడేరు గ్రామ వాసి ఫౌజియాను బుదవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు పదవి దక్కడం పట్ల బంధువులు మిత్రులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ద్వారా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని జూని యర్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తాననిహామీఇచ్చారు.