30 March, 2026 | 3:27 AM

పెట్టుబడులకు భరోసా గీతం డెవలపర్స్

30-03-2026 01:47 AM

బ్రోచర్‌ను ఆవిష్కరించిన బ్రహ్మానందం

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు భరోసా కలుగుతుందని, తక్కువ ధరలో నాణ్యమైన విల్లాలను అం దించేందుకు ముందుకు వచ్చిన గీతం డెవలపర్స్ సంస్థ ఎండీ కావలి పవన్ కుమార్ యాదవ్‌ను ప్రముఖ సీనీనటుడు డా.బ్ర హ్మానందం అభినందించారు. గచ్చిబౌలిలో ని సందిల్ టవర్స్ లో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు ప్రాజెక్టు గోల్డెన్ కౌంటీ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టును సందర్శించి, పరిశీలించానని అద్భుతమైన ప్రాజెక్టు అని తనకు అనిపించిందన్నారు.

ప్రజలు కూడా ప్రాజెక్టును సందర్శించిన తరువాతే కొనుగోలు చేయాలన్నారు. 15 ఏళ్లలో 500 ఎకరాలకు పైగా అభివృద్ధి చేసి 20కి పైగాప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. గీతండెవలపర్స్ ఎండీ కావలి పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొల్లూరులో 25 ఎకరాల్లో గోల్డెన్ కౌంటీ రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.