కోరం లేక అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం వాయిదా
30-03-2026 01:48 AM
కరీంనగర్ క్రైం, మార్చి 29 (విజయ క్రాంతి): కరీంనగర్ అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశము ఆదివారం కృషి భవన్ లో అధ్యక్షులు కర్ర రాజ శేఖర్ అధ్యక్షతన నిర్వహించినారు. ‘కోరము‘ లేనందున స మావేశాన్ని వాయిదా వేశారు. ఈ సందర్భం గా అధ్యక్షులు కర్ర రాజశేఖర్ మాట్లాడుతూ త్వరలో రిప్రజెంటేటివ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బ్యాంకు నిర్వహనరీత్య ఎజెండా ను సభకు సమర్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత, సరిల్ల రతన్ రాజు, దేశ వేదాద్రి, బశెట్టి కిషన్, కన్న సా యి, బండి ప్రశాంత్ దీపక్, అనరాసు కుమా ర్, తాడ వీరా రెడ్డి, ఉయ్యాలా ఆనందం, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




