యూరియా యాప్‌ను రద్దు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్‌కు భారతీయ కిసాన్ సంఘ నాయకుల వినతి
కామారెడ్డి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని గురువారం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కమిటీ ప్రతినిధులు అదన కలెక్టర్ విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతు లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.
ఇటీవల కురిసిన వడగళ్ల వాన తో మొక్కజొన్న పంట నేలకొరిగి తీవ్రంగా రైతులు నష్ట పోయారని ఎకరాకు రూ. 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్క్ పేడ్ డిఎం శశిధర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షుడు విట్టల్ రెడ్డి, బాలకిషన్, రామారావు, సంగారెడ్డి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.




