06-07-2025 01:38:33 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
వీణవంక, జూలై 5: గడిచిన ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మరిన్ని నిధులు తెచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నంబర్1గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా స్థాని క ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
శనివారం హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన బండి సంజయ్ స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి వీణవం కలో 18 అంతర్గత సీసీ రోడ్లను, జమ్మికుంట మండంలోని గండ్రపల్లి, ఇతర గ్రామాల్లో 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు.
అనంతరం ఆయ న మాట్లాడుతూ.. తాను 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసిందని అయినా ప్రజల కోసం మోదీని ఒప్పించి భారీగా నిధులు తీసుకొచ్చానని చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇంకా ని ధులు తీసుకొచ్చే అవకాశం వచ్చిందన్నారు.