calender_icon.png 6 July, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సమరభేరి’ విజయం కాంగ్రెస్ కార్యకర్తలదే

06-07-2025 01:39:56 AM

-పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సామాజిక న్యాయ సమరభేరి అద్భుతంగా విజయ వంతం కావడానికి ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడి కృషి చేశారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నా రు.

కాంగ్రెస్ అగ్రనాయకత్వం..కాంగ్రెస్ క్యా డర్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, కార్యదర్శి విశ్వనాధన్, మంత్రులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కార్యకర్త మృతి బాధాకరం..

సామాజిక న్యాయ సమరభేరి సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్త, దళిత నా యకుడు శ్రీను దుర్మరణం చెందడంపై పీ సీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కు టుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆ దుకుంటుందని హామీ ఇచ్చారు.