calender_icon.png 29 July, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకుల దాతృత్వం

29-07-2025 11:43:08 AM

మొడెం వంశీకి 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత. 

వాజేడు,(విజయక్రాంతి): అంతర్జాతీయ క్రీడలకు అర్హత సాధించిన మొడెం వంశీకి ములుగు జిల్లా బిఆర్ఎస్ నాయకుల(Mulugu District BRS Leaders) దాతృత్వంతో 75 వేల రూపాయల ఆర్థిక సహాయంను అందించారు.వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గల ఇప్పగూడెం గ్రామానికి చెందిన మొడెం వంశీ పవర్ లిఫ్టింగ్ లో భారతదేశ తరపున నార్త్ అమెరికాలో జరిగే పోటీలకు అర్హత సాధించారు. నార్త్ అమెరికా వెళ్ళుటకు మూడు నుండి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. వంశీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక బిఆర్ఎస్ నాయకులను ఆర్థిక సహాయం ఆర్థించారు.

వెంటనే స్పందించిన బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు 25 వేల రూపాయలు, మాజీ నూగురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్య 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కాగా  75 వేల రూపాయలను చీకుపల్లి గ్రామంలో గల బుచ్చయ్య స్వగృహమునందు ఆర్థిక సహాయంను అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ వాజేడు మండల యువతకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, యూత్ మండల అధ్యక్షులు ముడిగ తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెన్నం సాంబశివరావు, మొడెం ప్రకాష్, నాగరాజు, భోదెబోయిన వికాస్, వేములవాడ వేణు, పరిశిక రామకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.