24-09-2025 12:19:10 AM
కల్వకుర్తి సెప్టెంబర్ 23:భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జీవో నెంబర్ 12ను సవరించాలంటూ మంగళవారం కల్వకుర్తి డివిజన్ కేంద్రంలో ఉన్న అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కా ర్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సం ఘం రాష్ట్ర ఉపాధ్యకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో వినతి పత్రము అందజేశారు. భవ నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంను ప్రవేట్ ఇ న్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెం బర్ 12 ను సవరించి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అందించాలని డి మాండ్ చేశారు.
అక్రమంగా ప్రవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన 346 కోట్ల రూపాయలను తిరిగి బోర్డులో జమ చేయాలని కార్మి కుల డిమాండ్ల అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రాజు, యాదయ్య, సుదర్శన్ రెడ్డి, కె.వెంకటయ్య, పి.రాజు, జంగయ్య, ప్రభాకర్ రెడ్డి, కె.రాజు, జి.వెంకటయ్య తదితరులుపాల్గొన్నారు.