25 August, 2026 | 5:05 AM

సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్

25-08-2026 12:00 AM

మల్కాజిగిరి, ఆగస్ట్ 24 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర ఎన్ క్లేవ్ ఆనంద్ బాగ్ లో (16),  పీవీ ఎన్ కాలనీ లో (17), సాయికృప ఆర్కేడ్  లో(8) సీసీ కెమెరాలను మల్కాజిగిరి పోలీసులు జియో-ట్యాగింగ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ... మల్కాజిగిరి సీపీ సుమతీ సూచనల మేరకు నేను సైతం, మీ సురక్ష ‘కార్యక్రమంలో భాగంగా, గత వారం రోజులు గా పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో అపార్ట్మెంట్ యజమానులు, కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న  సుమారు 117 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని జియో-ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు.  నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు. వీటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యమైన కూడళ్లు, అపార్ట్మెంట్లలో ప్రజలందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ లు శంకర్ , ఉపేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.