కాంగ్రెస్‌లోకి అర్ష దంపతులు
కరీంనగర్ సిటీ, మే 12: నగరానికి చెందిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అర్ష మల్లేశం దంపతులు ఆదివారం కాంగ్రెస్‌లో చేశారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు సమక్షంలో వారు హస్తం గూటికి చేరారు. అర్ష మల్లేశం గతంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షునిగా, కార్పొరేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మల్లేశం సతీమణి కిరణ్మయి 23వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్‌లో బల్మూరి చేరిక
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బల్మూరి మహేందర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో మహేందర్‌రావు ఒకరు. తెలంగాణ జాగరణ సమితి రాష్ట్ర కమాండర్‌గా కూడా ఆయన పనిచేశారు.




