కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మె
- రెండో రోజూ విద్యుత్ ప్లాంట్ల వద్ద ధర్నాలు, నిరసనలు
- డిప్యూటీ సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఉద్యోగ క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఇతర అలవెన్స్ ల అమలు కోసం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తు న్న ఆర్టిసన్, అన్ మ్యాన్, పీస్ రేట్ విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. జెన్‌కో, ట్రా న్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థ ల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మం దికి పైగా కార్మికులు సమ్మెకు పూనుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆయా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఎదుట, సర్కిల్, డివిజన్ కేంద్రాల వద్ద ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వి ద్యుత్ కార్మికులకు మద్దతుగా వివిధ సం ఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ టీవీఈఏ జేఏసీ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొని మాట్లాడుతూ డి ప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
అధికారంలో రాకముందు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న క్రమంలో విద్యుత్ కార్మికులు వినతి పత్రాన్ని అందించగా, విద్యుత్ కార్మికులు ఆర్టిజన్, అన్మాన్డ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు విద్యుత్ కార్మిక సమస్యలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జేఏసీ నాయకుల ను తక్షణమే పిలిచి కార్మికుల ప్రధాన డిమాం డ్లు తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా విద్యుత్ కార్మికులు సమ్మె చేస్తు న్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీలో గురువారం ఉదయం బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. కేటీపీపీ స్టేజ్-1 500 మెగావాట్ల యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీక్ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని, మరమ్మత్తు పనులు ప్రారంభిం చామన్నారు. యూనిట్‌ను తిరిగి శుక్రవారం సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఈ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిలవడానికి ఆర్టీజను సమ్మెకు, ఈ బాయిలర్ ట్యూబ్ లీక్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.




