భయం వీడి పరీక్షలకు సిద్ధం కండి!
- ప్రణాళిక బద్ధంగా రాస్తే మీదే విజయం
- పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కథనం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 1౧ (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు సమీపి స్తున్న నేపథ్యంలో విద్యార్థులు భయం, ఆందోళనలకు లోనవకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష లను ఎదుర్కోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. సరైన ప్రణాళికతో చదివి పునశ్చరణ చేస్తూ పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యావేత్తలు తెలిపారు. ఈ నెల మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి ప్రజా పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 15 మం డలాల్లో 175 హైస్కూల్స్ ఉండగా, పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లాలోని వివి ధ పాఠశాలల నుంచి మొత్తం 6949 మంది పదో తరగతి విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం 500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. అదే విధంగా పరీక్షలు సక్రమంగా జరుగుతున్నా యా అనే విషయాన్ని పర్యవేక్షించేం దుకు 38 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పని చేయనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు సమాచారం.పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాపీ ప్రయత్నాలు, నకిలీ చర్యలకు పాల్పడకుండా విద్యార్థులు నిబద్ధతతో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
పరీక్షల సమయంలో విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షలకు ముందు రోజు సరిపడా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. రాత్రివేళ ఆలస్యంగా చదవడం వల్ల అలసట ఏర్పడి పరీక్ష సమయంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
పరీక్ష రోజు ఉదయం ముందుగానే లేచి పునశ్చరణ చేయడం, సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవడం చాలా ముఖ్యం. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, ఏ ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలో నిర్ణయించుకోవాలి. సమయాన్ని సరిగా వినియోగించు కుంటూ ప్రశాంతంగా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
భయం, అపోహలు దూరం పెట్టాలి..
పదో తరగతి పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థుల్లో భయం, ఆందోళన కనిపించడం సహజమని విద్యావేత్తలు చెబుతున్నారు. పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయని, తాము రాయలేమనే భావన కొందరిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇవి ఎక్కువగా అపోహలేనని తెలిపారు.
విద్యార్థులు ఇప్పటివరకు చదివిన పాఠాలను పునశ్చరణ చేయడం, నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయడం ద్వారా పరీక్షలను సులభంగా ఎదుర్కోవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్షలను భయంగా కాకుండా జీవితంలో ఒక సాధారణ దశగా భావిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
తల్లిదండ్రుల పాత్ర కీలకం...
పరీక్షల సమయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యం. పిల్లలపై అధిక ఒత్తిడి చేయకుండా వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. చదువుకు అనుకూలమైన వాతావర ణం కల్పించి, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా ప్రోత్సహించాలని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించడం, సమయానికి నిద్రపోయేలా చూడడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
ఆత్మస్థైర్యంతో పరీక్షలకు హాజరు కావాలి
పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షలు అనగానే విద్యార్థుల్లో ఆందోళన నెలకొనడం సహజమని, అయితే ఆందోళనను పక్కనపెట్టి ఆత్మస్థై ర్యంతో పరీక్షలకు హాజరు కావాలి.
పరీక్ష రోజు ముందు అర్ధరాత్రి వరకు చదవకుండా సరిపడా విశ్రాంతి తీసుకోవాలని, పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగానే చేరుకోవాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధా నాలు రాయాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలి.
ధర్మపురి వెంకటేశ్వర్లు, మోటివేషనల్ స్పీకర్




