07-12-2025 12:23:05 AM
ఘంటసాల జీవితంలోని విశేషాలతో దర్శకుడు సీహెచ్ రామారావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఈ బయోపిక్‌లో ఘంటసాలగా కృష్ణచైతన్య, ఆయన సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా తులసి చిత్రం ఫేమ్ అతులిత నటించగా సుమన్ ముఖ్యపాత్రను పోషించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్‌పై సీహెచ్ ఫణి నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేసిన కృష్ణచైతన్య మాట్లాడుతూ.. “తెలుగు సినిమా సం గీతానికి రెండు కళ్లలో ఒకటి గంటసాల అయితే రెండోది బాలసుబ్రమణ్యం. వాళ్లం దరి ఆశీర్వాదం ఈ సినిమాపై, నాపై ఉండటం నా అదృష్టం” అన్నారు. దర్శకుడు సీహెచ్ రామారావు మాట్లాడుతూ.. “మహాగాయకుడు ఘంటసాల గురించి ఇప్పటి తరానికి తెలియాలనే తపనతో ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాం.
భారతదేశ చరిత్ర లోనే ఒక గాయకుడి బయోపిక్ రావడం ఇదే ప్రథమం. ఆ ఖ్యాతి ఘంటసాలకు.. అది తీసే అదృష్టం నాకు దక్కింది” అని చెప్పారు. నిర్మాత శోభారాణి మాట్లా డుతూ.. “ఈ చిత్రం శంకరాభరణం స్థాయిలో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా” అని తెలిపారు. నిర్మాత ఫణి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, గీత రచయిత అనంత శ్రీరామ్, చదలవాడ శ్రీనివాస్, రేలంగి నరసింహారావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, జేకే భారవి పాల్గొన్నారు.