07-12-2025 12:25:09 AM
స్టార్ హీరో కార్తి నటిస్తున్న తాజాచిత్రం ‘అన్నగారు వస్తారు’. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనందరాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ నెల 12న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు.
సమాజానికి ఒక రియల్ హీరో అవసరమై నప్పుడు అన్నగారిలా అరంగేట్రం చేసే పోలీస్ ఆఫీసర్‌గా కార్తి అలరించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కార్తి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; సినిమాటోగ్రఫీ: జార్జ్ సీ విలియమ్స్; ఎడిటింగ్: వెట్రే కృష్ణన్; నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా; రచన, దర్శకత్వం: నలన్ కుమారస్వామి.