07-12-2025 12:20:17 AM
రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఛాంపియ న్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతోంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాతో మలయాళ భామ అనస్వర రాజన్ తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ శనివారం ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. 80వ దశకం లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి కమ్‌బ్యాక్ ఇస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మెగా స్టార్ చిరంజీవి లంకేశ్వరుడు సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన తర్వాత ఆయన దీర్ఘ విరామం తీసుకున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత కల్యాణ్ చక్రవర్తి మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ఆయన ఇందులో రియలిస్టిక్, కథకు కీలకమైన రాజిరెడ్డి పాత్రలో కనిపిస్తారు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; డీవోపీ: ఆర్ మదీ; ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.