calender_icon.png 7 August, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతం

07-08-2025 12:43:45 PM

హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా గురువారం తెలంగాణ నేత కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు(Kalvakuntla Taraka Rama Rao) శుభాకాంక్షలు తెలిపారు. ''నరాలను పోగులుగా,  తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.'' కేటీఆర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల(Telangana weavers) ప్రత్యేకత అన్నారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నా చేనేత అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు వందనం అన్నారు. సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగింది. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలకు పునర్వైభవం వచ్చింది. పనులు లేక, పొట్ట చేతపట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి, ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కే దక్కుతుందన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని కేటీఆర్ పేర్కొన్నారు.