25-11-2025 10:48:43 AM
అయోధ్య: శ్రీ రామ జన్మభూమి మందిర్(Shree Ramjanmbhumi Temple) ధ్వజారోహణ ఉత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. జెండా ఎగురవేత కార్యక్రమానికి సన్నాహాలు ఊపందుకుంటున్న తరుణంలో ఆయనకు స్వాగతం పలికేందుకు జనం దారి పొడవునా బారులు తీరారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి ఆలయాలు ఉన్న పవిత్ర సముదాయమైన సప్తమందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కాసేపట్లో అయోధ్య శ్రీరామాలయంలో ప్రవిత్ర ధ్వజారోహణం జరగనుంది. ధ్వజారోహణం కార్యక్రమంలో ప్రధాని పాల్గొనున్నారు. రామ్ లల్లా మందిరాన్ని( Ayodhya Ram Temple Flag Hoisting) దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రామ్ లల్లా మందిర శిఖరంపై ధ్వజారోహణం చేయనున్నారు. ధ్వజారోహణం కార్యక్రమంలో అధికార యంత్రాంగం కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.