16-12-2025 11:33:14 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం(GHMC Special Council Meeting) ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో వార్డుల విభజనపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) మాట్లాడుతూ... వార్డుల సంఖ్య పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. సరిహద్దులు, తదితర వివరాలు జీవో 266లో పొందుపరిచామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వార్డుల పెంపుపై అభ్యంతరాల స్వీకరణ రేపటితో ముగుస్తోందన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల(GHMC wards) సంఖ్యను ప్రభుత్వం 300కు పెంచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.