15 June, 2026 | 3:05 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

25-02-2026 08:35 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిలి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్  పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని పలు తరగతి గదులలో పరీక్ష జరుగుతున్న తీరును కలెక్టర్ స్నేహ శబరీష్   పరిశీలించారు. పరీక్షకు ఎంతమంది విద్యార్థులకు గాను ఎంతమంది హాజరయ్యారని డిఐఈవో ఎ.గోపాల్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీత, డిపార్ట్మెంటల్ అధికారి రమేష్ లను కలెక్టర్ అడిగి  తెలుసుకున్నారు.

పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాలను అడిగి అక్కడి పరిసరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో  ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసి ఇన్విజిలెటర్లకు అందజేసే  గదిని కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో పరీక్షల నిర్వహణ సజావుగా ఉండేలా చర్యలు చేపట్టాలని, పరీక్షల నిర్వహణకు సంబంధించిన  పలు సూచనలను కలెక్టర్ చేశారు.ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్ కోటేష్, సునీత తదితరులు ఉన్నారు. అదేవిధంగా వడ్డేపల్లిలోని ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని  జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను డీఐఈవో గోపాల్ ను అడిగి తెలుసుకున్నారు.