16-12-2025 12:24:39 PM
విలీనం తెలియదని మేయర్ ఒప్పుకున్నారు
హైదరాబాదీ సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం(GHMC General Body Meeting) కొనసాగుతోంది. విలీనం గురించి తెలియదని మేయర్ కూడా ఒప్పుకున్నారని దాసోజు శ్రవణ్ కుమార్(Dasoju Sravan Kumar) అన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీలతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని శ్రవణ్ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక ఆధారంగా విలీనం చేశారని చెప్పారు. సీజీజీ నివేదిక ఆధారంగా ఎలా విలీనం చేస్తారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సీజీజీ నివేదికను(CGG report) జీహెచ్ఎంసీ సమావేశంలో ఎందుకు ప్రవేశపెట్టలేదన్నారు. అశాస్త్రీయంగా ఇష్టారాజ్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని శ్రవణ్ ఆరోపించారు. రూల్ నంబర్ 5 ను ఎందుకు ఉల్లంఘించారు? అని ప్రశ్నించారు. హైదరాబాదీ సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.