25 February, 2026 | 10:53 PM

కూసుమంచి పెసర పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

25-02-2026 08:55 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకం క్రింద సాగుచేసిన పెసర పంటపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కూసుమంచి ఏడీఏ సతీష్ మాట్లాడుతూ పప్పు దినుసుల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య రైతులనుద్దేశించి మాట్లాడుతూ... పెసర పంటకు సంబంధించిన చీడపీడలపై అవగాహన కల్పించారు. అనంతరం పెసర పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి శ్రీమతి రామడుగు వాణి వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ బాబా, వంశీకృష్ణ  రైతులు పాల్గొన్నారు.