బీజేపీ కార్పొరేటర్ల నిరసన
16-12-2025 11:03 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను అధికారులు సభలో పెట్టనున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators) ఆందోళన చేపట్టారు. వార్డుల పునర్విభజనకు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office) వద్ద ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను సంప్రదించకుండా డివిజన్లు పెంచుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 3 పార్టీలు ఒకటయ్యాయని కార్పొరేటర్లు సూచించారు.




