calender_icon.png 5 October, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్ మారియో

05-10-2025 01:21:35 AM

‘నాటకం’, ‘తీస్‌మార్‌ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు కళ్యాణ్ జీ గోగణ. ఇప్పుడాడు ఆయన ‘మారియో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌కు ‘ఏ టర్బో-చార్జ్‌డ్ ర్యాంప్ రైడ్’ అనే వ్యాఖ్యను జోడించటం ద్వారా అందరిలో ఆసక్తి రేకెత్తేలా చేసింది.

యాక్షన్-ప్యాక్డ్, స్టైలిష్, రొమాంటిక్ వైబ్‌తో ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్‌ను చూస్తుంటే.. సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ ఎంతలా అలరించనుందో అర్థమవుతోంది. అనిరుధ్ రైఫిల్ పట్టుకుని ఉన్న తీరు, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయనిపిస్తోంది. ఇక ఎరుపు రంగు దుస్తుల్లో డైనమిక్‌గా కనిపిస్తోంది హెబ్బా.

ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్థాయి నిర్మాణం లో ఉంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు సంగీతం: సాయి కార్తీక్, రాకేందు మౌళి; సినిమాటోగ్రాఫర్: ఎంఎన్‌రెడ్డి; ఎడిటర్: మణికాంత్, మదీ మన్నెపల్లి; రచనా సహకారం, పాటలు: రాకేందు మౌళి; కథ, దర్శకత్వం: కళ్యాణ్ జీ గోగణ.