calender_icon.png 11 July, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలూ జాగ్రత్త

06-07-2025 12:00:00 AM

కెరియర్‌పై పూర్తిగా దృష్టి పెట్టి.. కుటుంబానికి సాయపడాలనే లక్ష్యంతో చాలామంది అమ్మాయిలు నైట్‌షిఫ్ట్ ఉద్యోగాలు చేసేందుకూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాత్రివేళల్లో పనిచేస్తోన్న ఆడవాళ్లలో ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువని యూరోపియన్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అంతేకాదు.. సాధారణ పనివేళల్లో ఉద్యోగం చేసే మహిళల కన్నా పర్మనెంట్ నైట్‌షిఫ్ట్‌లు చేసే ఆడవారిలో ఆస్తమా రిస్క్ 50శాతం అధికమట. అందులోనూ పోస్ట్‌మెనోపాజ్‌లో ఈ ప్రమాదం రెట్టింపు అట. శరీర జీవ గడియారం దెబ్బతిని, హార్మోనుల్లో మార్పులు జరగటం, ఆడవారిలో ఆస్తమాకు అడ్డుకట్ట వేసే హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు అందుకు కారణం కావొచ్చంటున్నారు పరిశోధకులు.

ఈ రీసెర్చ్ కోసం రెండున్నర లక్షలమంది డేటా తీసుకుని.. వారి షిఫ్ట్‌వర్క్ ఫ్రీక్వెన్సీ, ఆస్తమా ప్రాబల్యాన్ని పరిశీలించారు. అయితే.. నైట్‌షిఫ్ట్ చేస్తోన్న ఆడవాళ్లలో ఈ ప్రమాదం కనిపించగా, మగవారిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ గుర్తించలేదట. పనివేళల్లో మార్పులు చేసుకోవటం, రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు సరైన వ్యాయామాలు చేయడం ద్వారా ఈ రిస్క్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.